Youth Olympics : ఒలింపిక్స్‌లో క్రికెట్ పునరాగమనానికి అడుగులు పడుతున్నాయ్. లాస్ ఏంజెలెస్ నగరంలో 2028లో జరుగబోయే విశ్వ క్రీడల్లో క్రికెట్ కూడా భాగం కానుంది. అదే విధంగా యూత్ ఒలింపిక్స్‌లో (Youth Olympics)నూ ఈ ఆటను ప్రవేశపెట్టేందుకు అంతర్జాతీయ ఒలిపింక్స్ సంఘం ప్రయత్నిస్తోంది. అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) సహకారంతో కలిసి క్రికెట్ పోటీలు నిర్వహించాలని భావిస్తున్నట్టు శనివారం ఐఓసీ తెలిపింది.
ఒలింపిక్ సంఘం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘యూత్ ఒలింపిక్స్‌లో క్రికెట్ నిజంగా మంచి ఆలోచన. మేము ఆలోచించదగ్గది’ అని ఐసీసీ జనరల్ మేనేజర్ విలియం గ్లెన్‌రైట్ (William Glenwright) వెల్లడించాడు. 2030లో యూత్ ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వనున్న భారత్ ఇప్పటికే క్రికెట్ ఉండాలని పట్టు పడుతున్న విషయం తెలిసిందే.
యూత్ ఒలింపిక్స్ 2030కు భారత్‌లోని ముంబై నగరం ఆతిథ్యం ఇవ్వనుంది. నిరుడు అక్టోబర్‌లో ముంబై వేదికగా సాగిన ఐఓసీ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) 2030 యూత్ ఒలింపిక్స్, 2036 ఒలింపిక్స్ పోటీలను భారత్‌లో నిర్వహించేందుకు ఉత్సాహంగా ఉన్నామని అన్నాడు. ఇదే విషయాన్ని మోడీ 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట మీదుగా మరోసారి ప్రస్ఫుటించాడు.