Antim Panghal : పారిస్ ఒలింపిక్స్‌లో భారత్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఫైనల్‌కు ముందు స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్ (Vinesh Phogat)పై అనర్హత వేటు బాధను దిగమింగకముందే యువ రెజ్లర్ అంతిమ్ పంగల్ (Antim Panghal) నిషేధానికి గురైంది. అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం అంతిమ్‌పై ఏకంగా మూడేండ్ల నిషేధం విధించింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా భారత రెజ్లర్‌కు ఏఓసీ ఈ శిక్ష వేసింది.
అసలేం జరిగిందంటే..? పారిస్ ఒలింపిక్స్ విలేజ్ నుంచి అంతిమ్ పంఘల్ చెప్పాపెట్టకుండా బయలకు వెళ్లింది. అంతేకాదు అమె సోదరికి తన ఐడీ కార్డు ఇచ్చింది. అయితే.. ఆమె భద్రతా అధికారులకు దొరికింది. దాంతో, క్రమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడిన అంతిమ్‌పై ఐఓసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. యువ రెజ్లర్ చర్యను తీవ్రంగా పరిగణిస్తూ మూడేండ్ల నిషేధం విధించింది.
‘భారత ఒలింపిక్ సంఘం అధికారులు అంతిమ్, ఆమె సహాయ బృందాన్ని స్వదేశం పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అంతిమ్ క్షమశిక్షణ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఫ్రాన్స్ అధికారులు గుర్తించారు. ఒలింపిక్ విలేజ్‌కు రాకుండా అంతిమ్ కోచ్ భగత్ సింగ్, భాగస్వామి వికాస్‌తో కలిసి హోటల్‌కు చేరుకుంది. ఆ తర్వాత సోదరి నిషా(Nisha)కు తన గుర్తింపు కార్తు ఇచ్చి ఒలింపిక్ విలేజ్‌లోని తన వస్తువులను తీసుకురావాల్సిందిగా చెప్పింది.
Wrestler Antim Panghal will be BANNED for three years by the Indian Olympic Association.
As per PTI, she caused embarrassment to the Indian Olympic contingent by trying to facilitate her sister’s entry into the athletes village. Her sister was caught for impersonation and was… pic.twitter.com/LAcI7txqlC
— Himanshu Pareek (@Sports_Himanshu) August 8, 2024
అయితే.. అక్కడ భద్రతా అధికారులు అనుమానం వచ్చి నిశాను ప్రశ్నించగా ఆమె పొంతనలేని సమాధానాలు చెప్పింది. దాంతో, వాళ్లు నిశాను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేసి పంపించారు. ఒలింపిక్ నిబంధలను ఉల్లంఘించిన అంతిమ్‌పై ఐఓసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. మళ్లీ ఇటువంటి పోరపాటుకు తావివ్వకుండా ఆమెపై మూడేండ్ల నిషేధం విధించింది’ అని ఓ ప్రకటనలో ఐఓసీ వర్గాలు తెలిపాయి.
కెరీర్లో తొలి ఒలింపిక్స్ బరిలో నిలిచిన అంతిమ్ తీవ్రంగా నిరాశపరిచింది. బుధవారం జరిగిన 53 కిలోల విభాగం మ్యాచ్‌లో టర్కీ రెజ్లర్ జెయ్నెప్ యెట్గిల్(Zeynep Yetgil) చేతిలో కంగుతిన్నది. ప్రత్యర్థి ధాటికి కేవలం 101 సెకన్లలోనే చేతులెత్తేసింది. సాంకేతికంగా అత్యధిక పాయింట్లు సాధించిన జెయ్నెప్ 10-0తో అంతిమ్‌పై విజయం సాధించింది.
In a major embarrassment for INDIA, woman grappler @AntimPanghal & her support staff are being deported from #Paris2024 for a major disciplinary breach
She allegedly handed her official Accreditation Card to her sister who was caught by security & taken to police@sportwalkmedia pic.twitter.com/DHTz82AQbM— The Delhi Crown || Follow Us for Latest Delhi News (@DelhiCrown) August 7, 2024