Srilanka Squad : శ్రీలంక మిస్టరీ స్పిన్నర్ వనిందు హసరంగ (Wanindu Hasaranga) మళ్లీ జట్టుకు దూరమమ్యాడు. జూలైలో బంగ్లాదేశ్‌తో మ్యాచ్ సమయంలో తొడకండరాల గాయంతో బాధపడిన అతడు ఇంకా కోలుకుంటున్నాడు. దాంతో, జింబాబ్వే పర్యటన (Zimbabwe Tour)కు లంక స్పిన్ అస్త్రంగా దునిత్ వెల్లలాగే, జెఫ్రీ వాండర్సే ఎంపికయ్యారు. వైట్ బాల్ సిరీస్ కోసం గురువారం చరిత అసలంక సారథిగా 16మంది బృందాన్ని ప్రకటించారు సెలెక్టర్లు. బంగ్లాదేశ్ పర్యటనలో మెరిసిన అవిష్క ఫెర్నాండో, ఇషాన్ మలింగకు మాత్రం చోటు దక్కలేదు.
వన్డేల్లో ఇరగదీస్తున్న లంక పేస్ త్రయం ఈసారి జింబాబ్వే బ్యాటర్ల భరతం పట్టేందుకు సిద్దమవుతోంది. దుష్మంత చమీర, దిల్షాన్ మధుషనక, అసితా ఫెర్నాండ్లకు.. స్పిన్ దళంలోని థీక్షణ, వెల్లలాగే, వాండర్సే తోడయ్యారంటే ఆతిథ్య జట్టుకు కష్టకాలమే. ఆగస్టు చివరి వారంలో మొదలయ్యే పర్యటనలో లంక రెండు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అయితే.. పొట్టి ఫార్మాట్ స్క్వాడ్‌ను ఇంకా వెల్లడించలేదు. హరారేలో ఆగస్టు 29న తొలి వన్డే, ఆగస్టు 31న రెండో వన్డేలోజింబాబ్వేతో లంక తలపడనుంది.
Sri Lanka ODI Squad for Zimbabwe Tour 2025
The Sri Lanka Cricket Selection Panel has named the following squad for the ODI series against Zimbabwe.
The team will depart for Zimbabwe tomorrow, 22nd August.#SriLankaCricket #SLvZIM #ODI pic.twitter.com/oEZYjchOfQ— Sri Lanka Cricket 🇱🇰 (@OfficialSLC) August 21, 2025
శ్రీలంక స్క్వాడ్ : చరిత అసలంక(కెప్టెన్), పథుమ్ నిశాంక, నిశాన్ మధుష్క, కుశాల్ మెండిస్, సధీర సమరవిక్రమ, నువనిందు ఫెర్నాండో, కమిందు మెండిస్, జనిత్ లియనగే, పవన్ రత్ననాయకే, దునిత్ వెల్లలాగే, మిలాన్ రత్ననాయకే, మహీశ్ థీక్షణ, జెఫ్రీ వాండర్సే, అసితా ఫెర్నాండో, దుష్మంత్ చమీర, దిల్షాన్ మధుషనక.