Indy Racing | హైదరాబాద్, ఆట ప్రతినిధి: ప్రతిష్ఠాత్మక ఎఫ్ఐఎమ్ ప్రపంచ మోటో రేసింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు చెందిన ఇండీ రేసింగ్ టీమ్ విజేతగా నిలిచింది. ఒసాకా(జపాన్) వేదికగా జరిగిన సీజన్ తొలి పోరులో అరంగేట్రం టీమ్ ఇండీ రేసింగ్ పోడియం ఫినిష్ చేసింది. ఎఫ్ఐఎమ్ టోర్నీలో టైటిల్ విజేతగా నిలిచిన తొలి భారత టీమ్‌గా ఇండీరేసింగ్ అరుదైన రికార్డు సొంతం చేసుకుంది.
ప్రత్యర్థి రేసర్లను అధిగమిస్తూ ఇండీ రేసింగ్ తరఫున సాండ్రా గోమెజ్, స్పెన్సర్ విల్టన్ అద్భుత ప్రదర్శన కనబరిచారు. ప్రతికూల పరిస్థితుల మధ్య రేసర్లు టాప్ గేర్‌లో దూసుకెళ్లారు. రేస్‌లో ఇండీ టీమ్ 121 పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతుండగా, హోండా (132), రాబీ మ్యాడిసన్ (131) ముందువరుసలో ఉన్నాయి. పోడి యం ఫినిష్ చేసిన ఇండీ రేసింగ్ టీమ్‌ను కేఎస్‌జీ యజమాని అభిషేక్‌రెడ్డి అభినందించారు.