Rohit Sharma: టీమిండియా సారథి రోహిత్ శర్మ తన పేరిట మరో రికార్డును రాసుకున్నాడు. ఐసీసీ తొలిసారిగా (2007 నుంచి) ప్రవేశపెట్టిన టీ20 వరల్డ్ కప్ నుంచి పొట్టి క్రికెట్ ఆడుతున్న హిట్‌మ్యాన్.. అఫ్గాన్‌తో ఇండోర్ వేదికగా జరుగుతున్న మ్యాచ్ ద్వారా 150 మ్యాచ్‌లు ఆడిన ఘనత సొంతం చేసుకున్నాడు. ఈ ఫార్మాట్లో 150 మ్యాచ్‌లు ఆడిన తొలి క్రికెటర్ (పురుషుల క్రికెట్లో) రోహిత్ శర్మనే కావడం గమనార్హం. ఐర్లాండ్‌కు చెందిన పాల్ రాబర్ట్ స్టిర్లింగ్ 134 మ్యాచ్‌లతో రెండో స్థానంలో నిలిచాడు. ఐర్లాండ్‌కే చెందిన డాక్రెల్ (128 మ్యాచ్‌లు) మూడో స్థానంలో నిలవగా పాక్ మాజీ సారథి షోయభ్ మాలిక్ 124 మ్యాచ్‌లతో నాలుగో స్థానంలో ఉన్నాడు. కివీస్ ఓపెనర్ మార్టిన్ గుప్తిల్.. 122 మ్యాచ్‌లు ఆడి ఐదో స్థానంలో ఉండగా టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ.. 119 మ్యాచ్‌లతో పదో స్థానంలో నిలిచాడు.
భారత్ నుంచి అంతర్జాతీయ స్థాయిలో అత్యధిక మ్యాచ్‌లు ఆడినవారిలో రోహిత్ కంటే ముందే మహిళా క్రికెట్ జట్టు సారథి హర్మన్‌ప్రీత్ కౌర్ ఈ రికార్డు అందుకుంది. 2009 నుంచి టీ20లు ఆడుతున్న కౌర్.. ఇటీవలే ఆస్ట్రేలియాతో ముగిసిన టీ20 సిరీస్ వరకూ 161 మ్యాచ్‌లు ఆడింది. ఆమె తర్వాత కివీస్‌కు చెందిన సుజన్న విల్సన్ బేట్స్ (152), డానియల్ వ్యాట్ (151), అలీస్సా హీలి (150)లు రోహిత్ కంటే ముందున్నారు. భారత స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన.. 128 మ్యాచ్‌లు ఆడి ఈ జాబితాలో తొమ్మిదో స్థానంలో నిలిచింది.
Milestone 🚨 – @ImRo45 is all set to play his 150th match in the shortest format of the game.
Go well, Skip 🫡#TeamIndia pic.twitter.com/1uWje5YNiq
— BCCI (@BCCI) January 14, 2024
2007 నుంచి టీ20లు ఆడుతున్న హిట్‌మ్యాన్.. 118 ఇన్నింగ్స్‌లలో 3,853 పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడి సగటు 31.07గా ఉండగా తన కెరీర్లో రోహిత్ నాలుగు సెంచరీలు సాధించడం విశేషం. టీ20లలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ (4008) అగ్రస్థానంలో ఉండగా రోహిత్ రెండో స్థానంలో ఉన్నాడు.