Animesh – Bolt : భారత అథ్లెటిక్స్‌లో సంచనలంగా మారిన అనిమేశ్ కుజుర్ (Animesh Kujur) తన అభిమాన హీరోను కలిశాడు. తాను ట్రాక్ మీద చిరుతలా పరుగెత్తడానికి .. భారత ఫాస్టెస్ట్ మ్యాన్‌గా అవతరించడానికి స్ఫూర్తినిచ్చిన ‘ఉసేన్ బోల్ట్'(Usain Bolt)తో ముంబైలో ముచ్చటించాడు అనిమేశ్. పుమా కంపెనీ నిర్వహించిన కార్యక్రమంలో జమైకా స్టార్ పలువురు క్రీడా ప్రముఖులను కలుసుకున్నాడు. భారత పరుగుల వీరుడిగా ఎదుగుతున్న అనిమేశ్తో కాసేపు కబుర్లు చెప్పాడు బోల్ట్. ఈ సందర్భంగా ఇరువరు రన్నింగ్ ట్రాక్ మీద అద్భుతాలు సృష్టించడం గురించి చర్చించుకున్నారు.
బోల్ట్, అనిమేశ్ కలిసి ఉన్న ఫొటోను పుమా కంపెనీ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో జాతీయ రికార్డు నెలకొల్పిన అనిమేశ్ పుమా ఫ్యామిలీతో కలిసినందుకు గర్వంగా ఉంది అని క్యాప్షన్ రాసుకొచ్చింది. తన ఐడల్ బోల్ట్‌ను కలిసిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేకతున్నానని అనిమేశ్ అన్నాడు. బోల్ట్ సైతం యువకెరటంపై ప్రశంసలు కురిపించాడు.
‘నీ చేతులు శరీరంతో సమాంతరంగా కదలవు. అవి ముందుకూ వెనక్కి కదులుతుంటాయి. నవు పరుగెత్తడం చూశాను. నువ్వు ఎడమ చేతిని లాక్ చేసి కుడిచేతిని వదులుగా ఉంచుతావు. అలాకాకుండా ఈసారి రెండింటినీ లాక్ చేసి చూడు. నువ్వే విజేతగా నిలుస్తావు’ అని మాజీ ఒలింపియన్ వెల్లడించాడు. ఈ సందర్బంగా బోల్ట్ నుంచి ఫాస్ట్‌గా పరుగెత్తడానికి తోడ్పడే సలహాలు, సూచనలు అడిగి తెలుసుకున్నాడు అనిమేశ్. భారత పర్యటనలో ఉన్న బోల్ట్‌ను మాజీ గోల్‌కీపర్ శ్రీజేష్, బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు కూడా కలిశారు.
ట్రాక్ మీద రాకెట్ వేగంతో దూసుకెళ్లే అనిమేశ్ కుజుర్ది ఛత్తీస్‌గఢ్‌లోని మారుమూల గ్రామం. ఆరడుగుల రెండు అంగుళాల పొడవుండే ఇతడు టీనేజ్ నుంచే తన స్పీడ్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాడు. ఈమధ్యే 100 మీటర్ల దూరాన్ని 10.18 సెకన్లలో చేరుకొని చరిత్ర సృష్టించాడు. తద్వారా గురిందెర్విర్ (10.20 సెకన్లు) పేరిట ఉన్న జాతీయ రికార్డును బద్ధలు కొట్టి ది ‘ఫాస్టెస్ట్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా అవతరించాడు అనిమేశ్. 22 ఏళ్లకే దేశం గర్వించదగ్గ అథ్లెట్‌గా మారిన అతడు ఈమధ్యే మొనాకో డైమండ్ లీగ్‌లో పోటీపడ్డాడు.
అండర్ -23 విభాగంలో 200 మీటర్ల పరుగులో ఆస్ట్రేలియా స్టార్ గౌట్ గౌట్‌తో ‘నువ్వానేనా’ అన్నట్టు పరుగు తీసి ఔరా అనిపించాడు అనిమేశ్. అయితే.. సెకన్లో పదో వంతుతో పోడియం మీద నిల్చొనే అవకాశం కోల్పోయాడు. అయినా సరే.. అతడేమీ నిరాశకు లోనవ్వడం లేదు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగులో అంతర్జాతీయ వేదికలపై భారతీయ జెండాను రెపరెపలాడించేందుకు మరింత గట్టిగా ప్రయత్నించేందుకు సిద్దమవుతున్నాడీ యంగ్ అథ్లెట్.