బర్మింగ్‌హామ్: భారత యువ షట్లర్లు గాయత్రి గోపిచంద్-త్రిసా జాలీ జోడీ సంచలన ప్రదర్శన కొనసాగుతున్నది. స్టార్ ఆటగాళ్లంతా ఇంటిబాట పట్టిన ప్రతిష్ఠాత్మక ఆల్‌ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో ఈ జంట వరుస విజయాలతో సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.
శుక్రవారం జరిగిన మహిళల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో గాయత్రి-త్రిసా జంట 21-14, 18-21, 21-12తో లి వెన్-లియూ జాన్ (చైనా) ద్వయంపై విజయం సాధించింది. గంటకు ఆల్ ఇంగ్లండ్ చాంపియన్‌షిప్‌లో సెమీస్‌కు చేరడం ఈ జంటకు వరుసగా ఇది రెండోసారి కావడం విశేషం. శనివారం జరుగనున్న సెమీఫైనల్లో కొరియా షట్లర్లు బీక్ హా-లీ సో హీతో మనవాళ్లు అమీతుమీ తేల్చుకోనున్నారు.