న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కాంస్య పతకంతో మెరిసిన భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లోనూ సత్తాచాటాడు. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ కెరీర్లో అత్యుత్తమంగా 6వ స్థానానికి చేరాడు.
పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రణయ్ ఒక్కడే టాప్-10లో చోటు దక్కించుకోగా.. లక్ష్యసేన్ 12, శ్రీకాంత్ 20వ ర్యాంక్‌ల్లో కొనసాగుతున్నారు. పురుషుల డబుల్స్‌లో సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట రెండో ర్యాంక్ నిలబెట్టుకుంది.