షెన్జెన్: చైనా మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ లో భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ రెండో రౌండ్‌కు చేరుకున్నాడు. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో 31 ఏళ్ల ప్రణయ్ 21-18, 22-20 స్కోరుతో చైనీస్ తైపీకి చెందిన చౌ తీన్ చెన్పై గెలుపొందాడు. వెన్ను నొప్పి కారణంగా గత రెండు టోర్నీలకు గైర్హాజరైన ప్రణయ్ విజయంకోసం రెండు గేమ్‌లలో తీవ్రంగా శ్రమించాడు.
పలుమార్లు వెనుకంజలో ఉన్నప్పటికీ పుంజుకుని విజయం సాధించాడు. భారత పురుషుల జోడి సాత్విక్-చిరాగ్ జోడికూడా ముందంజ వేసింది. సాత్విక్-చిరాగ్ 21-13, 21-10తో ఇగ్లండ్కు చెందిన బెన్ లేన్-సీన్ వెండిలపై సునాయాసంగా గెలుపొందారు. బరిలో నిలిచిన ఏకైక భారత మహిళ ఆకర్షి కశ్యప్ తొలి రౌండ్లోనే 12-21, 14-21తో చైనాకు చెందిన జాంగ్ యి మన్ చేతిలో ఓడిపోయింది.