లండన్: ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత హాకీ జట్టు మరోసారి దుమ్మురేపింది. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన మ్యాచ్‌లో భారత్ 7-1తో పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించి మూడు రోజుల వ్యవధిలో ఆ జట్టుపై వరుసగా రెండో విజయాన్ని నమోదుచేసింది. భారత్ నుంచి సుఖ్జీత్ (20వ నిమిషంలో), హర్మన్‌ప్రీత్ (26వ) హార్దిక్ (34వ), జుగ్రాజ్ (35వ), అభిషేక్ (41వ), రాజ్‌కుమార్ (44వ), దిల్‌ప్రీత్ (54వ) గోల్స్ చేయగా పాక్ తరఫున అబూ మహ్మద్ (13వ) ఒక్కడే గోల్ కొట్టాడు.