Travis Head | అడిలైడ్: ప్రపంచ క్రికెట్ చరిత్రలో జస్ప్రీత్ బుమ్రా దిగ్గజ పేసర్ అని ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్ అన్నాడు. అతడి బౌలింగ్‌ను ఎదుర్కొన్నానని తాను తన మనుమలు, మనుమరాళ్లతో గర్వంగా చెప్పుకుంటానని తెలిపాడు. ‘క్రికెట్ చరిత్రలో దిగ్గజ ఫాస్ట్ బౌలర్ల జాబితాలో బుమ్రా కచ్చితంగా ఒకడిగా నిలుస్తాడు. అతడిని ఎదుర్కోవడం కఠిన సవాల్‌తో కూడుకున్నది. నా కెరీర్ ముగిసిన తర్వాత బుమ్రా వంటి పేసర్‌ను ఎదుర్కొన్నానని భవిష్యత్‌లో నా వారసులతో చెప్పుకుంటా’ అని హెడ్ కొనియాడాడు.