ప్రిస్టినా (కొసావో): భార త టేబుల్ టెన్నిస్ యువ సంచలనం, 15 ఏండ్ల దివ్యాన్షి భోమిక్ అంతర్జాతీయ వేదికపై సరికొత్త చరిత్ర సృష్టించింది. డబ్ల్యూటీటీ ఫీడర్ టోర్నీ మహిళల సింగిల్స్, డబుల్స్ టైటిళ్లను గెలుచుకుంది. ప్రపంచ 211వ ర్యాంకర్ దివ్యాన్షి సోమవారం జరిగిన ఫైనల్లో 3-2 (8-11, 11-8, 11-5, 7-11, 11-7)తో 38వ ర్యాంకర్ యెహ్ యి తియాన్ (చైనీస్ తైపీ)ని ఓడించింది. ఈ టైటిల్ నెగ్గిన భారత యంగెస్ట్ ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. డబుల్స్ విభాగంలో తోటి టీనేజర్ సిండ్రెలా దాస్‌తో జతకట్టిన దివ్యాన్షి తుదిపోరులో 3-2తో సచి అయోకి-కొకోనా మురమతు(జపాన్) జోడీని ఓడిచింది.