ముంబై : త్వరలో జరగాల్సి ఉన్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టు ఎంపిక మరింత ఆలస్యం కానుంది. ఐసీసీ నిబంధనల ప్రకారం జనవరి 12 నాటికే ప్రాథమిక జట్టును ప్రకటించాల్సి ఉన్నప్పటికీ.. బీసీసీఐ మాత్రం మరింత సమయం కావాలని ఐసీసీని కోరినట్టు తెలుస్తోంది. ఈనెల 18 లేదా 19న భార త జట్టును ప్రకటించే అవకాశముంది.