న్యూఢిల్లీ: చాంపియన్స్ ట్రోఫీ(Champions Trophy)కి ముందు భారత్ జలక్ తగిలింది. టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్ .. తన స్వదేశానికి వెళ్లాడు. దుబాయ్ నుంచి అతను .. దక్షిణాఫ్రికాకు పయనం అయ్యాడు. మోర్కల్ తండ్రి కన్నుమూశాడు. దీంతో అంత్యక్రియల్లో పాల్గొనేందుకు అతను స్వదేశానికి వెళ్లినట్లు తెలుస్తోంది. సోమవారం జరిగిన ప్రాక్టీస్ సెషన్‌కు బౌలింగ్ కోచ్ మోర్కల్ హాజరుకాలేదు. మోర్కల్ మళ్లీ ఎప్పుడు జట్టుతో కలుస్తాడన్న క్లారిటీ లేదు. అతను లేకపోవడం వల్ల చాంపియన్స్ ట్రోఫీలో భారత జట్టుపై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి 20వ తేదీన బంగ్లాదేశ్‌తో ఇండియా తొలి మ్యాచ్ ఆడనున్నది.
మూడు వారాలు సాగి చాంపియన్స్ ట్రోఫీ శనివారం నుంచి ప్రారంభంకానున్నది. కరాచీలో పాకిస్థాన్, న్యూజిలాండ్ మధ్య తొలి మ్యాచ్ ఉంటుంది. ట్రోఫీ కోసం మొత్తం 8 జట్లు పోటీపడుతున్నాయి. ఇండియా తన మ్యాచుల్ని దుబాయ్‌లో ఆడనుండగా, మిగితా జట్లు పాక్ వేదికల్లో పోటీపడనున్నాయి. 2017లో చాంపియన్స్ ట్రోఫీ పాకిస్థాన్ గెలుచుకున్నది. 8 ఏళ్ల తర్వాత మళ్లీ సీటీ టోర్నీ నిర్వహిస్తున్నారు.