ఇస్లామాబాద్: ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌కప్‌లో ఇండియా దారుణంగా నిష్క్రమించిన విషయం తెలిసిందే. అయితే పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత జట్టు ఘోరంగా ఓటమి పాలైంది. దీనిపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ ఇంజమాముల్ హక్ స్పందించారు. ఓ స్థానిక ఛానల్‌తో మాట్లాడుతూ పాకిస్థాన్‌తో మ్యాచ్ ప్రారంభం కావడానికి ముందు భారత్ తీవ్ర వత్తిడికి గురైందని, ఆటగాళ్లు భయంలో పడిపోయినట్లు ఇంజీ అన్నాడు. పాక్‌తో మ్యాచ్‌కు ముందు భారతీయ ఆటగాళ్ల బాడీ లాంగ్వేజ్ సరిగా లేదన్నాడు. టాస్ సమయంలో విరాట్, బాబర్ బాడీ లాంగ్వేజ్‌ను చూస్తే ఇది అర్థం అవుతుందన్నాడు. రోహిత్, రాహుల్‌లు త్వరగా ఔటైనా.. అదేమీ పెద్ద ప్రభావం చూపే అంశం కాదని తెలిపాడు. భారత్‌తో పోలిస్తే ఆ మ్యాచ్‌లో పాకిస్థాన్ ప్లేయర్ల బాడీ లాంగ్వేజ్ బెటర్‌గా ఉందన్నాడు. రోహిత్ శర్మ త్వరగా ఔటవడంతో ఇండియా వత్తిడిలో లేదని, కానీ శర్మనే వత్తిడిలో ఉన్నాడని, మ్యాచ్ ప్రారంభంకావడానికి ముందే భారత ఆటగాళ్లు వత్తిడిలో ఉన్నట్లు చెప్పాడు. టీ20 క్రికెట్లో ఇండియా బాగా ఆడుతుందని, వాస్తవానికి టోర్నీ ఫెవరేట్లు వారని, కానీ ఇండోపాక్ మ్యాచ్‌లో ఉండే వత్తిడిని వాళ్లు తట్టుకోలేకపోయారన్నాడు. పాకిస్థాన్‌పై ఓడిన వత్తిడిలో కివీస్‌తోనూ ఆ జట్టు సరిగా ఆడలేదని, సాంట్నర్, సోధీలను కూడా వాళ్లు ఆడలేకపోయారని విమర్శించాడు.