Canada Open | కల్గరి: కెనడా ఓపెన్‌లో భారత యువ షట్లర్లు ప్రియాన్షు రజావత్, త్రిసా జాలీ-గాయత్రీ గోపీచంద్ ద్వయం తమ జోరు కొనసాగిస్తున్నది.
కల్గరి (కెనడా) వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భాగంగా శుక్రవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో రజావత్ 21-19, 21-11తో టకుమా ఒబయాషి (జపాన్)ను ఓడించి క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు.
మహిళల డబుల్స్‌లో త్రిసా-గాయత్రి జోడీ 17-21, 21-7, 21-8తో నటస్జ -అలీస్సా ద్వయంపై గెలిచింది.