బాకు(అజర్బైజాన్): భారత యువ షూటర్ మెహులీ ఘోష్ వచ్చే ఏడాది జరుగనున్న ప్రతిష్ఠాత్మక పారిస్ ఒలింపిక్స్‌కు బెర్తు దక్కించుకుంది. ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షిప్ 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించడం ద్వారా మెహులీ విశ్వక్రీడలకు అర్హత సాధించింది.
శనివారం జరిగిన మహిళల 10మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్లో మెహులీ 229.8 పాయింట్లతో మూడో స్థానంతో కాంస్యం ఖాతాలో వేసుకుంది. జియాహన్(251.4), జిలిన్ వాంగ్(250.2) వరుసగా స్వర్ణ, రజత పతకాలు దక్కించుకున్నారు. పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంపై మెహులీ సంతోషం వ్యక్తం చేసింది.