హంబర్గ్: హంబర్గ్ స్కాష్ ఓపెన్‌లో భారత యువ ప్లేయర్ వీర్చోత్రాని పోరాటం ముగిసింది. శనివారం హోరాహోరీగా సాగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో వీర్ చోత్రాని 10-12, 11-9, 12-14, 11-9. 6-11తో బాప్టిస్ మసోట్టి(ఫ్రాన్స్) చేతిలో పోరాడి ఓడాడు. తొలి గేమ్ నుంచే ఇద్దరి మధ్య హోరాహోరీ పోరు జరిగింది.
69 నిమిషాల పాటు సాగిన పోరులో చోత్రాని పుంజుకుని పోటీలోకి వచ్చినా..ప్రత్యర్థి దీటుగా బదులివ్వడంతో మ్యాచ్ చేజార్చుకోవాల్సి వచ్చింది. మరోవైపు అభయ్‌సింగ్, రమిత్ టాండన్, జోష్న చినప్ప ఇప్పటికే టోర్నీ నుంచి వైదొలిగిన సంగతి తెలిసిందే.