Sarfaraz Khan | పెర్త్: భారత యువ బ్యాటర్ సర్ఫరాజ్‌ఖాన్ గాయపడ్డాడు. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు కోసం సన్నద్ధమవుతున్న సర్ఫరాజ్‌కు గురువారం జరిగిన నెట్ ప్రాక్టీస్‌లో మోచేతికి గాయమైంది. దీంతో నొప్పితో విలవిలలాడిన సర్ఫరాజ్ వెంటనే నెట్స్ నుంచి నిష్క్రమించాడు.
అయితే గాయం తీవ్రత ఎక్కువ లేదని తెలిసింది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్‌శర్మ గైర్హాజరీలో ఖాన్ తుది జట్టులో చోటు దక్కించుకునే చాన్స్ ఉంది. కమిన్స్, స్టార్క్, హాజిల్‌వుడ్‌ను ఎలా ఎదుర్కొంటాడో చూడాలి.