Bajrang Punia | ఢిల్లీ: డోప్ పరీక్షలకు నమూనాలు ఇవ్వలేదనే కారణంతో నాలుగేండ్ల నిషేధానికి గురైన రెజ్లర్ బజ్రంగ్ పునియా ఈ వివాదంపై స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవేళ తాను గనక బీజేపీలో చేరితే తనపై ఉన్న నిషేధాలన్నింటినీ ఎత్తివేస్తారని పునియా అన్నాడు. బజ్రంగ్ మాట్లాడుతూ.. ‘నాడా నిషేధం నన్నేమీ ఆశ్చర్యానికి గురి చేయలేదు.దీనిపై నేను గతంలోనే వెల్లడించాను. నాడా అధికారులు శాంపిల్స్ కోసం వచ్చినప్పుడు గడువు ముగిసిన కిట్లతో వచ్చారు.దీనిపై సోషల్ మీడియాలో పోస్ట్ చేశాను. ఒకవేళ నేను బీజేపీలో చేరితే ఈ నిషేధాలన్నింటినీ ఎత్తేస్తారు’ అని తెలిపాడు.