పాట్నా: సెపక్తక్రా ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు రజతంతో సత్తా చాటింది. బీహార్ రాజధాని పాట్నాలో జరుగుతున్న ఈ పోటీలలో భాగంగా ఆదివారం జరిగిన ఉమెన్స్ డబుల్స్ ఫైనల్లో భారత్.. 0-2 (9-15, 9-15)తో మలేషియా చేతిలో ఓడింది. 20 దేశాలు పోటీపడుతున్న ఈ టోర్నీలో మహిళల డబుల్స్ ఈవెంట్‌ను ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి కాగా మొదటి ప్రయత్నంలోనే భారత జట్టు రజతం దక్కించుకోవడం విశేషం. పురుషుల డబుల్స్‌లోనూ భారత జట్టు కాంస్యం గెలిచింది. ఈ టోర్నీలో భారత జట్టు ఇప్పటికే ఒక రజతం, మూడు కాంస్యాలు సాధించగా మరో మూడు విభాగాల్లో పతకాలు దక్కించుకునే దిశగా ముందుకు సాగుతోంది.