పెర్త్: ఆస్ట్రేలియాతో ఏకైక టెస్టులో భారత మహిళల జట్టు భారీ ఓటమి చవిచూసింది. మూడు రోజుల్లో ముగిసిన గులాబీ బంతితో డే అండ్ నైట్ టెస్టు పోరులో ఆసీస్ 10 వికెట్ల తేడాతో టీమ్ఇండియాపై ఘన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 25 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా 4.3 ఓవర్లలో విజయాన్నందుకుంది.
ఓపెనర్లు జార్జియా వోల్(16 నాటౌట్), లిచ్‌ఫీల్డ్(11 నాటౌట్) అజేయంగా నిలిచారు. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 105/6 ఆదివారం రెండో ఇన్నింగ్స్‌కు దిగిన టీమ్ఇండియా 149 పరుగులకు ఆలౌటైంది. ఓవర్‌నైట్ బ్యాటర్ ప్రతీకా రావల్(137 బంతుల్లో 63, 3ఫోర్లు) అర్ధసెంచరీతో ఆకట్టుకోగా, మిగతావారు ఘోరంగా విఫలమయ్యారు. లూసీ హామిల్టన్ సదర్లాండ్ కింగ్ గార్డ్నర్(2/8) రెండేసి వికెట్లు తీశారు. లోయార్డర్‌లో స్నేహ్‌రానా(30)..ప్రతీకకు మెరుగైన సహకారం అందించింది. ఆసీస్ దిగ్గజం అలీసా హిలీ తన టెస్ట్ కెరీర్‌కు వీడ్కోలు పలికింది. ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాచ్ విజయంలో కీలకమైన సదర్లాండ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’తో పాటు సిరీస్ దక్కింది.