న్యూఢిల్లీ: ఇటీవల విశేష ప్రతిభ చూపిన భారత మహిళా షట్లర్లు అశ్విని పొన్నప్ప, తనీష క్రాస్టొ ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 24వ స్థానానికి చేరుకున్నారు. మంగళవారం విడుదల చేసిన ర్యాంకింగ్స్‌లో అశ్విని-తనీష నాలుగు స్థానాలు మెరుగయ్యారు.
ఈ యేడాది జనవరిలో జతకట్టిన వీరు మొత్తం 16 టోర్నీలలో 44,590 పాయింట్లు సాధించారు. మరో మహిళా డబుల్స్ జోడి గాయత్రి గోపీచంద్-త్రిషా జాలి 49,435 పాయింట్లతో 19వ స్థానంలో కొనసాగుతున్నారు. పురుషుల డబుల్స్ జోడి సాత్విక్-చిరాగ్ శెట్టి 2వ ర్యాంక్‌ను నిలబెట్టుకున్నారు. కాగా ప్రణయ్ 8, లక్ష్య సేన్ 17, శ్రీకాంత్ 24, సింధు 8వ ర్యాంక్‌లలో కొనసాగుతున్నారు.