పారిస్ : ఆర్చరీ ప్రపంచ కప్లో భారత్ రెండో స్వర్ణం సాధించింది. ఫ్రాన్స్ రాజధాని పారిస్లో ఆదివారం జరిగిన వరల్డ్కప్ స్టేజ్ 3 లో భారత మహిళల రికర్వ్ టీమ్ గోల్డ్ మెడల్ గెలుచుకుంది. దీపిక కుమారి, కోమలిక బరి, అంకిత భాకట్తో కూడిన బృందం మెక్సికోపై 5-1 తేడాతో సునాయాస విజయం సాధించింది. అంతకుముందు శనివారం జరిగిన వ్యక్తిగత విభాగంలో అభిషేక్ వర్మ బంగారు పతకం సాధించారు.
Indian 🇮🇳 women’s recurve archery team of
— All India Radio News (@airnewsalerts) June 27, 2021
Deepika Kumari, Komolika Bari and Ankita Bhakat win the Gold 🥇 at the Archery World Cup Stage 3 in Paris after a 5-1 win over Mexico.pic.twitter.com/qB6E6nNi7l