కౌలాలంపూర్: మలేషియా మాస్టర్స్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత మహిళల జోడీ త్రిసా జాలీ-గాయత్రి గోపీచంద్ రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు.
మంగళవారం జరిగిన మహిళల డబుల్స్ తొలి రౌండ్లో ఏడో సీడ్ భారత జంట 21-14, 21-10 తేడాతో హువాంగ్-లియాంగ్ (చైనీస్ తైపీ)పై గెలిచింది. మరో డబుల్స్ పోరులో పాలక్ , ఉన్నతి హుడా 10-21, 5-21తో చైనీస్ హు యిన్-లియన్ జి యున్ చేతిలో ఓడారు.