Asian Games: నిరాశపరిచిన పీవీ సింధు.. మహిళా షట్లర్ల ఫ్లాప్‌షో
Asian Games: పీవీ సింధు నేతృత్వంలోని భారత మహిళా షట్లర్ల బృందం ఆసియా క్రీడల్లో పేలవ ప్రదర్శన కనబరిచింది. ఇవాళ థాయిలాండ్ చేతిలో ఇండియా 0-3 తేడాతో ఓడిపోయింది. సింగిల్స్ మ్యాచ్‌లో పీవీ సింధు ఓటమి పాలైంది.
హాంగ్జూ: ఆసియా క్రీడల్లో(Asian Games) భారత మహిళల బ్యాడ్మింట్ జట్టు నిరాశపరిచింది. పీవీ సింధు నేతృత్వంలో ఆ బృందం పేలవ ప్రదర్శన కనబరిచింది. క్వార్టర్ ఫైనల్లో థాయిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దారుణంగా ఓడిపోయింది. శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా 0-3 తేడాతో థాయిలాండ్ చేతిలో ఓటమి పాలైంది. బలమైన థాయ్ జట్టు ముందు ఇండియా మహిళా షట్లర్లు నిలవలేకపోయారు.థాయ్ జట్టులో మాజీ వరల్డ్ చాంపియన్ రచనోక్ ఇంటనన్, వరల్డ్ నెంబర్ 12 ప్లేయర్ పోర్న్పావి చోచువాంగ్, వరల్డ్ నెంబర్ 17 సుపనిదా కటేతాంగ్‌లు ఉన్నారు.
ఆసియా క్రీడల్లో భారత బ్యాడ్మింటన్ స్టార్లు కనీస పోరాటాన్ని కూడా ప్రదర్శించలేకపోయారు. రెండు సార్లు ఒలింపిక్ మెడల్ గెలిచిన పీవీ సింధు.. మహిళ సింగిల్స్ మ్యాచ్‌లో 21-14, 15-21, 14-21 స్కోరుతో చోచువాంగ్ చేతిలో ఓడిపోయింది. ట్రెస్సా జోలీ, గాయత్రి గోపిచంద్‌కు చెందిన భారత జోడి.. 19-21, 5-21 స్కోరుతో మహిళల డబుల్స్ ఈవెంట్లో పరాజయం పాలయ్యారు. ఇక ఎడమ చేతి షట్లర్ అస్మితా చాలిహ 9-21, 16-21 స్కోరుతో బుసానన్ ఒంగ్బామ్‌రుంగ్‌పాన్ చేతిలో ఓడిపోయింది.
2014లో ఇంచియాన్‌లో జరిగిన ఆసియా క్రీడల్లో భారత మహిళా షట్లర్లు టీమ్ ఈవెంట్లో కాంస్య పతకం గెలిచిన విషయం తెలిసిందే.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

