ఢిల్లీ: భారత టెన్నిస్ డబుల్స్ ఆటగాడు శ్రీరామ్ బాలాజీ, తన ఆస్ట్రేలియా సహచరుడు నీల్ ఒబర్లీట్నర్ ద్వయం పోర్చుగల్‌లో జరిగిన ఒయెరాస్ 3 చాలెంజర్ టోర్నీలో డబుల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. మూడో సీడ్‌గా బరిలోకి దిగిన ఈ భారత, ఆస్ట్రేలియా జోడీ ఆదివారం జరిగిన ఫైనల్లో 6-7 (7/9), 6-4, 11-9తో నికోలస్ (కొలంబియా), ఎరియల్ బెహర్ (ఉరుగ్వే) ద్వయాన్ని ఓడించి విజేతగా నిలిచింది. తొలి సెట్ కోల్పోయినా తర్వాత పుంజుకున్న ఈ జోడీ.. వరుస సెట్స్‌లో ప్రత్యర్థిని నిలువరించి టైటిల్ సాధించింది.