చెన్నై: స్వదేశంలో జరుగుతున్న స్కాష్ వరల్డ్ కప్‌లో భారత జట్టు సరికొత్త చరిత్ర సృష్టించింది. నిరుటి ఎడిషన్‌లో కాంస్యం గెలిచి ఈసారి కచ్చితంగా పతకం రంగు మార్చాలన్న పట్టుదలతో బరిలోకి దిగిన భారత్.. సెమీస్‌లో 3-0తో డిఫెండింగ్ చాంపియన్స్ ఈజిప్ట్‌ను మట్టికరిపించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తద్వారా ఈ టోర్నీ చరిత్రలో తొలిసారి ఫైనల్స్ చేరి రికార్డు సృష్టించింది.
టోర్నీ ఆసాంతం రాణిస్తున్న వెలవన్ సెంథిల్ కుమార్, అన్హత్ సింగ్, అభయ్ సింగ్ వరుస విజయాలతో ఈజిప్ట్‌కు షాక్ తప్పలేదు. టైటిల్ పోరులో భారత జట్టు హాంకాంగ్‌తో తలపడుతుంది.