న్యూఢిల్లీ: ఈ ఏడాది అక్టోబర్‌లో యూఏఈ వేదికగా జరగాల్సి ఉన్న ప్రతిష్టాత్మక మహిళల టీ20 ప్రపంచకప్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) భారత జట్టును ప్రకటించింది. 15 మంది సభ్యులతో కూడిన టీమ్ఇండియాకు హర్మన్‌ప్రీత్‌కౌర్ సారథ్యం వహించనుండగా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుంది. ఇటీవల ముగిసిన మహిళల ఆసియా కప్‌లో ఆడిన జట్టులో వికెట్ కీపర్ ఉమా ఛెత్రి మినహా మిగిలిన వారంతా ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నారు.
స్మృతి మంధాన, జెమీమా రోడ్రిగ్స్, షఫాలీ వర్మ, హర్మన్‌ప్రీత్ కౌర్, రిచా ఘోష్, దయాలన్ హేమలత బ్యాటింగ్ బాధ్యతలు మోయనున్నారు. పేసర్లుగా రేణుకా సింగ్, పూజా వస్త్రకార్, అరుంధతిరెడ్డి ఉండగా దీప్తి శర్మ, ఆశా శోభన, రాధా యాదవ్, సజనా సజీవన్ వంటి స్పిన్నర్లతో జట్టు పటిష్టంగా ఉంది.
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్, రిచా ఘోష్ (వికెట్ కీపర్), యస్తికా భాటియా, పూజా వస్త్రకార్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాలన్ హేమలత, ఆశా శోభన, రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్
ట్రావెలింగ్ రిజర్వ్: ఉమా ఛెత్రి, తనూజా కన్వర్, సైమా ఠాకూర్