IND W Vs IRE W | ఐర్లాండ్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌కు టీమిండియా వుమెన్స్ జట్టును బీసీసీఐ ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్‌లో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, ఫాస్ట్ బౌలర్ రేణుకా సింగ్ ఠాకూర్‌కు విశ్రాంతి ఇచ్చింది. జనవరి 10 నుంచి రాజ్‌కోట్‌లో వేదికగా జరుగనున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ సోమవారం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఓపెనర్ స్మృతి మంధాన కెప్టెన్‌గా వ్యవహరించనున్నది. హర్మన్‌ప్రీత్ గాయం కారణంగా వెస్టిండ్‌తో జరిగిన తొలి రెండు టీ20ల్లో ఆడలేకపోయింది. మూడు టీ20లోకి అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోనూ ఆడింది.
గతేడాది అక్టోబర్‌లో దుబాయి వేదికగా జరిగిన మహిళల టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో గాయపడింది. ఇక వెస్టిండిస్‌తో జరిగిన మూడు మ్యాచుల్లో పది వికెట్లు పడగొట్టిన ఫాస్ట్ బౌలర్ రేణుక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచింది. రేణుక వెన్నుముకపై ఒత్తిడి, పగులుతో ఇబ్బందిపడుతున్నది. ఈ క్రమంలో ఐర్లాండ్ సిరీస్ ఇద్దరు ప్లేయర్లకు బీసీసీఐ విశ్రాంతి ఇచ్చింది. రేణుక గైర్హాజరీలో సయాలీ సత్ఘరే, సైమా ఠాకూర్ బౌలింగ్ బాధ్యతలను మోయనున్నారు. ఇక మూడు వన్డేలు ఐర్లాండ్‌తో రాజ్‌కోట్ వేదికగా జరుగుతాయి. అన్ని మ్యాచులు ఉదయం 11 గంటలకు మొదలవుతాయి. తొలి వన్డే 10న, రెండో వన్డే 12న, మూడో వన్డే 15న జరుగుతుంది.
స్మృతి మంధాన (కెప్టెన్), దీప్తి శర్మ (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమీమా రోడ్రిగ్స్, ఉమా ఛెత్రి (వికెట్ కీపర్), రిచా ఘోష్ (వికెట్ కీపర్), తేజల్ హసబ్నిస్, రాఘవి బిస్త్, మిన్ను మణి, ప్రియా మిశ్రా, తనూజా కన్వర్, టిటాస్ సాధు, సైమా ఠాకోర్, సయాలీ సత్ఘరే.