భువనేశ్వర్ : ఇండియన్ సూపర్ లీగ్ పోరులో ఆదివారం ఒడిషా జట్టు 2-1 గోల్స్‌తో కేరళ బ్లాస్టర్స్‌పై విజయం సాధించింది. ఒడిషా జట్టులో జెర్రీ మాహిమ్తాంగ (54ని.), పెడ్రొ మార్టిన్ (86ని.) గోల్స్ సాధించగా, కేరళ జట్టులో హర్మన్జోత్ సింగ్ కబ్ర(35ని.) గోల్ చేశాడు. విరామానికి కేరళ జట్టు 1-0తో ఆధిక్యంలో నిలిచినా, ద్వితీయార్ధంలో ఒదిషా జట్టు పుంజుకుని రెండు గోల్స్ చేసి విజయాన్నందుకుంది.