PV Sindhu | ఓడెన్స్: డెన్మార్క్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీలో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం క్వార్టర్స్‌లోనే ముగిసింది. క్వార్టర్స్‌లో సింధు.. 13-21, 21-16, 9-21తో గ్రెగొరియా టున్‌జుంగ్ (ఇండోనేషియా) చేతిలో ఓటమిపాలైంది.
తొలి రౌండ్ నుంచే ఆధిక్యం ప్రదర్శించిన టున్‌జుంగ్ జోరుకు సింధు తలవంచక తప్పలేదు. రెండో గేమ్‌లో సింధు పుంజుకున్నా నిర్ణయాత్మక మూడో గేమ్‌లో టున్‌జుంగ్ ధాటికి భారత షట్లర్‌కు పరాభవం తప్పలేదు. సింధు ఓటమితో ఈ టోర్నీలో భారత్ పోరాటం కూడా ముగిసినైట్టెంది.