దోహా: టేబుల్ టెన్నిస్ వరల్డ్ చాంపియన్‌షిప్స్‌లో భాగంగా మూడోరోజు జరిగిన డబుల్స్ విభాగాల్లో భారత్‌కు నిరాశే ఎదురైంది. పురుషుల డబుల్స్‌లో మానవ్ టక్కర్-మనుష్ షా.. 1-3 (5-11, 9-11, 11-8, 5-11)తో డంగ్-బెనెడిక్ట్ (జర్మనీ) చేతిలో ఓటమి పాలయ్యారు.
మహిళల డబుల్స్‌లో సుతీర్థ-ఐహిక ద్వయం 0-3తో (1-11, 11-13, 7-11)తో కౌఫ్మన్-షన్ (జర్మనీ) చేతిలో ఓడారు. కానీ మరో డబుల్స్ పోరులో దియా-యశస్వీ 3-1 (6-11, 11-6, 11-6, 11-9)తో జెంగ్ జియాన్, సెర్ లిన్ క్వియాన్ (సింగపూర్)ను ఓడించి ప్రిక్వార్టర్స్‌కు అర్హత సాధించారు. పురుషుల సింగిల్స్‌లో మనుష్ 0-4తో ఫెలిక్స్ (ఫ్రాన్స్) చేతిలో ఓడిపోయాడు.