బ్యాంకాక్: థాయ్‌లాండ్ ఓపెన్ సూపర్ 500 టోర్నమెంట్లో భారత షట్లర్ల పోరాటం రెండో రౌండ్ కూడా దాటలేదు. సింగిల్స్ విభాగంలో 8 మంది, డబుల్స్ ఈవెంట్స్‌లో నాలుగు జంటలు బరిలో నిలిచినా ఒక్కరంటే ఒక్కరూ ముందంజ వేయలేక చతికిలపడ్డారు.
పురుషుల సింగిల్స్ బరిలో ఉన్న ఏకైక ఆటగాడు తరుణ్ మన్నెపల్లి.. మహిళల సింగిల్స్‌లో మాళవిక, ఉన్నతి, ఆకర్షి కశ్యప్ ఇంటిబాట పట్టారు. మహిళల డబుల్స్‌లో త్రిసా-గాయత్రి జోడీ సైతం ఓడింది.