ఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో ప్రపంచకప్‌తో పోల్చే ప్రతిష్టాత్మక థామస్ కప్‌లో నాలుగోసారి కాంస్యం గెలుచుకున్నా తమకు రావాల్సిన గుర్తింపు దక్కడంలేదని భారత స్టార్ షట్లర్లు చిరాగ్ శెట్టి, హెచ్ఎస్ ప్రణయ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. థామస్ కప్‌లో సెమీస్ చేరి కాంస్యం సాధించిన భారత్ మంగళవారం స్వదేశానికి చేరుకుంది. ఈ సందర్భంగా చిరాగ్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షట్లర్లందరూ ఉన్న ఫోటో పెట్టి.. ‘ఇప్పుడే ఇంటికి చేరాం. ఏమీ మారలేదు.
గత రెండువారాల్లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. దీని గురించి ఎవరూ పట్టించుకోవడం లేదు’ అని రాసుకొచ్చాడు. ప్రణయ్ స్పందిస్తూ.. ‘ ఈ ఆట గురించి తెలిసినవారికి ఇది ఎంత పెద్ద టోర్నీయో తెలుసు. కానీ సాధారణ ప్రజలకు మాత్రం ఈ విజయం తాలూకు ప్రభావం తెలియడం లేదు. అది చాలా నిరాశగా ఉంది’ అని అసంతృప్తి వ్యక్తం చేశాడు.