కొట్టాయం: ప్రఖ్యాత షూటింగ్ కోచ్, మాజీ జాతీయ చాంపియన్ సన్నీ థామస్(Sunny Thomas) కన్నుమూశారు. ఆయన వయసు 83 ఏళ్లు. సన్నీ థామస్ షూటింగ్ జట్టుకు కోచ్‌గా ఉన్న సమయంలో భారత్ అనేక టోర్నీల్లో అత్యద్భుత ప్రదర్శన ఇచ్చింది. కొట్టాయంలోని ఉజావూర్ ఇంట్లో ప్రాణాలు విడిచారు. బ్రేక్ ఫాస్ట్ చేసిన తర్వాత అతనికి స్ట్రోక్ వచ్చినట్లు గుర్తించారు. ఆ సమయంలో ఆయన భార్య జోసమ్మ అక్కడే ఉన్నారు. తండ్రి సన్నీ థామస్ గుండెపోటుతో మృతిచెందినట్లు కొడుకు మనోజ్ సన్నీ పేర్కొన్నాడు.
కొట్టాయం జిల్లాలోని తిడనాడ్లో సెప్టెంబర్ 26, 191లో ఆయన జన్మించారు. రైఫిల్ షూటింగ్లో ఆయన జాతీయ చాంపియన్. అకాడమిక్స్‌లో ఇంగ్లీష్ బోధించేవారు. 1993 నుంచి 2012 వరకు భారత షూటింగ్ బృందానికి కోచ్‌గా చేశారాయన. ఆయన కోచ్‌గా ఉన్న సమయంలో ఇండియా .. ఒలింపిక్స్, వరల్డ్, ఏషియన్ , కామన్వెల్త్ గేమ్స్‌లో అనేక పతకాలు సాధించింది. 108 బంగారు, 74 సిల్వర్, 53 కాంస్య పతకాలు సాధించింది. రైఫిల్ 3 పొజిషన్ ఓపెన్ సైట్ ఈవెంట్లో నేషనల్ చాంపియన్‌గా నిలిచాడతను.
కొట్టాయం రైఫిల్ క్లబ్లో అతను షూటింగ్ ప్రారంభించాడు. సన్నీ థామస్ జాతీయ కోచ్‌గా ఉన్న సమయంలో.. అనేక మంది యువ షూటర్లు ఆవిర్భవించారు. 2004 ఏథేన్స్ ఒలింపిక్స్‌లో మేజర్ రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్(సిల్వర్), 2008లో అభినవ్ బింద్రా(గోల్డ్), 2021 లండన్ ఒలింపిక్స్‌లో విజయ్ కుమార్(సిల్వర్), గగన్ నారంగ్(బ్రాంజ్)లు పతకాలు అందుకున్నారు.