Shubman Gill : మొదటి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో యువ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ సెంచరీతో చెలరేగాడు. కళాత్మక షాట్లు ఆడిన శుభ్‌మన్ మెహదీ హసన్ మిరాజ్ బౌలింగ్లోరెండు ఫోర్లు కొట్టి శతకం అందుకున్నాడు. బంగ్లా బౌలర్లను ఉతికి ఆరేస్తూ 148 బంతుల్లో వంద పరుగులు సాధించాడు. ఇది అతనికి టెస్టుల్లో తొలి సెంచరీ. దాంతో భారత్ భారీ దిశగా పయనిస్తోంది. మరో ఎండ్‌లో వాల్ ఛతేశ్వర్ పూజారా హాఫ్ సెంచరీ చేశాడు. తొలి ఇన్నింగ్స్‌లో పూజారా తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. 90 రన్స్ వద్ద అవుట్ అయ్యాడు.
సెంచరీ తర్వాత ధాటిగా ఆడే క్రమంలో శుభ్‌మన్ మెహిదీ హసన్‌కు వికెట్ సమర్పించుకున్నాడు. దాంతో భారత్ రెండు వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు.