హంగేరి: ప్రతిష్టాత్మక పారిస్ ఒలింపిక్స్‌లో బెర్తులు దక్కించుకున్న భారత రెజ్లర్లు..ఈ మెగా ఈవెంట్‌కు ముందు అంతర్జాతీయ స్థాయిలో మరో కఠిన సవాల్‌కు సిద్ధమయ్యారు. గురువారం నుంచి హంగేరి వేదికగా బుడాపెస్ట్ ర్యాంకింగ్ సిరీస్‌లో ఐదుగురు రెజ్లర్లు బరిలోకి దిగనున్నారు. మహిళల విభాగంలో అంతిమ్ పంగల్, వినేశ్ ఫోగట్, రీతికా హుడా, అన్షు మాలిక్ బరిలో ఉండగా అమన్ సెహ్రావత్ సైతం పోటీలో ఉన్నాడు.