జురిచ్ (స్విట్జర్లాండ్): డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, భారత గోల్డెన్ బాయ్ నీరజ్ చోప్రాకు ప్రతిష్టాత్మక డైమండ్ లీగ్ ఫైనల్లో గట్టి పోటీ నెలకొంది. జురిచ్ వేదికగా గురువారం (ఆగస్టు 28న) జరుగబోయే ఈ ఏడాది డైమండ్ లీగ్ (డీఎల్) ఫైనల్లో నీరజ్‌కు డిఫెండింగ్ చాంపియన్ ఆండర్సన్ పీటర్స్ (గ్రెనెడా)తో పాటు జులియన్ వెబర్ (జర్మనీ), జులియస్ యెగొ (కెన్యా)ల నుంచి తీవ్ర పోటీ తప్పేలా లేదు.
2022లో డీఎల్ ట్రోఫీ గెలిచిన నీరజ్.. గత రెండేండ్లూ రన్నరప్‌తో సరిపెట్టుకున్నాడు. ఈ సీజన్లో తొలిసారి 90 మీటర్ల (దోహాలో 90.23 మీ.) మార్కును అందుకున్న అతడు ఆ తర్వాత ఆ స్థాయి ప్రదర్శన చేయలేకపోతున్నాడు.