నింగ్బొ: చైనాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా చాంపియన్‌షిప్స్‌లో భారత మిక్స్డ్ డబుల్స్ జోడీ ధ్రువ్ కపిల-తనీషా క్రాస్టో క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. కానీ సింగిల్స్ విభాగాల్లో భారత్ పోరాటం రెండో రౌండ్లోనే ముగిసింది. స్టార్ షట్లర్లు పీవీ సింధు, ప్రియాన్షు రజావత్, కిరణ్ జార్జి.. ప్రిక్వార్టర్స్‌లోనే వెనుదిరిగారు. గురువారం జరిగిన మిక్స్డ్ డబుల్స్ రెండో రౌండ్లో ధ్రువ్-క్రాస్టో జోడీ 12-21, 21-16, 21-18 యి హాంగ్ వీ-నికోల్ గొంజాలెస్ (చైనీస్ తైపీ)పై పోరాడి గెలిచింది.
కానీ మహిళల సింగిల్స్‌లో ప్రపంచ 17వ ర్యాంకర్ సింధు 12-21, 21-16, 16-21తో ప్రపంచ నాలుగో ర్యాంకర్ జపాన్ అమ్మాయి యమగూచి చేతిలో పరాజయం పాలైంది. పురుషుల సింగిల్స్‌లో రజావత్ 14-21, 17-21తో కొడాయ్ నరకొర (జపాన్)కు తలవంచక తప్పలేదు. మరో పోరులో జార్జి.. 21-19, 13-21, 16-21తో ప్రపంచ ఐదో ర్యాంకర్ కున్లావత్ వితిద్సరన్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయాడు. ఈ టోర్నీలో ధ్రువ్-క్రాస్టో మినహా మిగిలి భారత్ షట్లర్లు రెండో రౌండ్‌కే ఇంటిబాట పట్టారు.