భువనేశ్వర్: ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో భారత పురుషుల జట్టు బోణీ కొట్టింది. తొలి మ్యాచ్‌లో స్పెయిన్ చేతిలో ఓడినా అదే జట్టుతో ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం 2-0తో ప్రత్యర్థిని చిత్తుచేసి బదులు తీర్చుకుంది. భారత్ తరఫున మన్‌ప్రీత్ సింగ్ (32ని.), దిల్‌ప్రీత్ (40ని.) రెం డు గోల్స్ సాధించారు. మహిళల విభాగంలో శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను ఓడించిన అ మ్మాయిలు.. వారితోనే జరిగిన రెండో మ్యాచ్‌లో మాత్రం ఓడారు. నిర్ణీత సమయానికి స్కోర్లు 2-2తో సమంగా నిలవడంతో మ్యాచ్ షూటౌట్‌కు దారితీసింది. షూటౌట్లో ఇంగ్లండ్ 2-1తో భారత్‌ను ఓడించింది.
మనికా ఔట్
ఢిల్లీ: ఈనెల 19 నుంచి చైనాలో జరుగబోయే టేబుల్ టెన్నిస్ ఆసియా కప్-2025లో భారత్ స్టార్ ప్యాడ్లర్ మనికా బాత్రా లేకుండానే బరిలోకి దిగనుంది. ఇటీవలే తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న మనికా.. గాయం కారణంగా ఈ టోర్నీ నుంచి వైదొలిగింది. ఆమె స్థానంలో యువ ప్యాడ్లర్ యశస్వినీ.. ఆకుల శ్రీజ, ఐహిక ముఖర్జీతో కలిసి మహిళల సింగిల్స్‌లో ఆడే అవకాశం దక్కించుకుంది.