Asia Team Championship 2024: మలేషియా వేదికగా జరుగుతున్న బ్యాడ్మింటన్ టీమ్ ఆసియా ఛాంపియన్షిప్ – 2024లో తొలుత అమ్మాయిలు 3-2 తేడాతో చైనా గండాన్ని దాటగా తాజాగా అబ్బాయిలు కూడా అదుర్స్ అనిపించారు. స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ఓటమిపాలైనా.. మిగిలిన షట్లర్లు మాత్రం హాంకాంగ్‌ను కోలుకోనీయలేదు. ఫలితంగా భారత్ 4-1 తేడాతో హాంకాంగ్‌ను చిత్తుచేసి ఈ టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్‌కు అర్హత సాధించింది. క్వార్టర్స్‌లో భారత్.. చైనాతో ఆడనుంది.
మూడు సింగిల్స్, రెండు డబుల్స్ మ్యాచ్‌లు ఉన్న ఈ టోర్నీలో భాగంగా మొదటి మ్యాచ్‌లో భారత్‌కు ఆశించిన ఆరంభం దక్కలేదు. భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. 18-21, 14-21 తేడాతో ఎన్జి క లంగ్ అంగుస్ చేతిలో ఓడిపోయాడు. దీంతో హాంకాంగ్ 1-0 ఆధిక్యం దక్కించుకుంది. కానీ మెన్స్ డబుల్స్‌లో భాగంగా వరల్డ్ నెంబర్ వన్ జోడీ సాత్విక్ – చిరాగ్‌లు 21-16, 21-11 తేడాతో లుయి చున్ – యింగ్ షింగ్ చుయ్ తేడాతో అలవోక విజయం సాధించి స్కోరును 1-1 తేడాతో సమం చేశారు.
INDIAAAA…INDIAAAAAAA 👏👏👏
Well done boys, keep it up! 💥#BATC2024#TeamIndia#IndiaontheRise#Badminton pic.twitter.com/CH4uBHB3WH
— BAI Media (@BAI_Media) February 14, 2024
తదనంతరం జరిగిన మెన్స్ సింగిల్స్ పోరులో భారత యువ షట్లర్ లక్ష్య సేన్.. 21-14, 21-9 తేడాతో చన్ యిన్ చక్‌ను చిత్తు చేశాడు. రెండో డబుల్స్ మ్యాచ్‌లో ఎం.ఆర్. అర్జున్ – ధ్రువ్ కపిలల ద్వయం.. 21-12, 21-7 తేడాతో చై హిన్ లంగ్ – హుంగ్ కుయి చున్లను ఓడించడంతో భారత్ లీడ్ 3-1కి చేరింది. చివరి సింగిల్స్ మ్యాచ్‌లో కిదాంబి శ్రీకాంత్.. 21-14, 21-18 తేడాతో జేసన్ గునవన్ను ఓడించడంతో భారత్.. 4-1 ఆధిక్యంతో హాంకాంగ్‌ను చిత్తు చేసి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.