Yuzvendra Chahal : భారత కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ(MS Dhoni) చెరగని ముద్ర వేసిన విషయం తెలిసిందే. ప్రశాంతంగా ఉండే మహీ టీమిండియాకు మూడు ఐసీసీ ట్రోఫీ(ICC Trophy)లు అందించిన సారథిగా మహీ రికార్డు సృష్టించాడు. ఇక టీ20ల్లో హార్దిక్ పాండ్యా(Hardhik Pandya) నాయకుడిగా అదరగొడుతున్నాడు. వరుస సిరీస్‌లు గెలుస్తూ వన్డే కెప్టెన్సీకి పోటీగా తయారయ్యాడు. అయితే.. ఇద్దరు జట్టును నడిపించే తీరు ఒకేలా ఉందని లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్(Yuzvendra Chahal) అంటున్నాడు. వెస్టిండీస్‌తో రెండో వన్డే ముందు అతను ధోనీ, పాండ్యా కెప్టెన్సీ గురించి ఆసక్తికర విషయాలు చెప్పాడు.
ఈ ఇద్దరూ బౌలర్లకు స్వేచ్ఛనిస్తారని చాహల్ తెలిపాడు. అంతేకాదు నలుగురు కెప్టెన్లలో ఆడడం ఎలా ఉంది? అని అడుగగా.. ‘ధోనీని పెద్దన్నగా చూస్తా. ఆ తర్వాత విరాట్ కోహ్లీ(Virat Kohli), రోహిత్ శర్మ(Rohit Sharma), హార్దిక్ పాండ్యా వస్తారు. అయితే.. మైదానంలోకి దిగాక వీళ్లంతా జట్టు గెలవాలని కోరుకుంటారు.
చాహల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ
వీళ్లంతా ఫ్రీడమ్ ఇచ్చేవాళ్లు. ఇప్పుడు పాండ్యా కూడా అదే చేస్తున్నాడు. బౌలర్లకు ఫీల్డింగ్‌లో మార్పులు చేసుకొనేందుకు అనుమతిస్తున్నాడు. అయితే.. బౌలర్ ప్లాన్ వర్కవుట్ కానప్పుడే పాండ్యా కలుగజేసుకుంటాడు’ అని చాహల్ వెల్లడించాడు.
టీమిండియా టీ20 స్పెషలిస్ట్ స్పిన్నర్‌గా చాహల్ గత కొన్నాళ్లుగా అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 16వ సీజన్(IPL 2023)లో అతను అత్యధిక వికెట్ల రికార్డు నెలకొల్పాడు. చెన్నై సూపర్ కింగ్స్(Chennai Super Kings) ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో(183 వికెట్లు) రికార్డు బద్ధలు కొట్టాడు.
చాహల్, డ్వేన్ బ్రావో
భారత్ , వెస్టిండీస్‌ల మధ్య ఈరోజు రెండో టీ20 జరుగనుంది. తొలి మ్యాచ్‌లో 4 పరుగుల తేడాతో ఓడిన టీమిండియా విజయంపై కన్నేసింది. ఈ మ్యాచ్‌లో టెస్టు సిరీస్‌లో సెంచరీ బాదిన యశస్వీ జైస్వాల్(Yashasvi Jaiswal)కు చోటు దక్కనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.