భారత క్రీడా చరిత్రలో తొలిసారి విశ్వవేదికపై Lawn Bowls క్రీడలో పతకం నెగ్గే క్షణాలు త్వరలోనే సాక్షాత్కరం కానున్నాయి. కామన్వెల్త్ క్రీడలలో భాగంగా సోమవారం జరిగిన సెమీస్‌లో భారత మహిళా జట్టు.. ఈ క్రీడలో అపార అనుభవమున్న న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్ చేరింది. తద్వారా పతకం ఖాయం చేసుకుంది.
లాన్ బోల్స్లో ఇప్పటివరకు భారత జట్టు పతకం నెగ్గిన దాఖలాలు లేవు. కానీ లవ్లీ చౌబే, పింకి, నయన్మోని సైకియా, రూపా రాణిలతో కూడిన బృందం.. సెమీస్‌లో 16-13 తేడాతో న్యూజిలాండ్‌ను ఓడించి ఫైనల్‌కు చేరింది. మంగళవారం భారత జట్టు దక్షిణాఫ్రికాతో ఫైనల్లో తలపడనుంది. ఈ పోటీలో ఏ పతకం గెలిచినా అది చరిత్రే కానుంది.
ఈ క్రీడలో న్యూజిలాండ్‌కు అపార అనుభవముంది. ఆ జట్టు లాన్ బోల్స్లో సుమారుగా 40 పతకాలు నెగ్గింది. సోమవారం సెమీస్‌లో భాగంగా తొలుత అదే ఛాంపియన్ ఆట ఆడింది. తొలి భాగంలో భారత్ 0-5తో వెనుకబడి ఉంది. కానీ భారత బృందం తర్వాత పుంజుకుని 7-6 ఆధిక్యాన్ని సాధించింది. ఆట ముగిసే సమయానికి భారత ఆధిక్యం 16-13కు చేరింది. తద్వారా భారత్ ఫైనల్‌కు అర్హత సాధించింది.
Watch the #LawnBowls Women’s team in action in their semi-finals today at 1:30 PM IST
All the best 👍
Let’s #Cheer4India 🇮🇳#IndiaTaiyaarHai 🤟#India4CWG2022 pic.twitter.com/nEBEbQ03Rn
— SAI Media (@Media_SAI) August 1, 2022