నేషనల్ ఛాంపియన్‌షిప్స్‌లో భాగంగా జరుగుతున్న మ్యాచ్‌లో తలపడేందుకు వచ్చిన కిక్బాక్సర్.. రింగ్‌లోనే కుప్పకూలాడు. ఈ ఘటన చెన్నైలో వెలుగు చూసింది. యోరా టాడే అనే 22 ఏళ్ల కిక్బాక్సర్.. ఇక్కడ జరుగుతున్న నేషనల్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొనేందుకు వచ్చాడు. అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఇతను.. తలపై బలమైన దెబ్బ తగలడంతో రింగ్‌లో కుప్పకూలాడు.
దీంతో అతన్ని వెంటనే స్థానికంగా ఉన్న రాజీవ్ గాంధీ జనరల్ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ శస్త్రచికిత్స చేసినప్పటికీ యోరా.. తమ ట్రీట్మెంట్కు స్పందించలేదని వైద్యులు తెలిపారు. ఈ క్రమంలోనే అతను మరణించినట్లు వెల్లడించారు.