అంట్వెర్ప్: ఇంటర్నేషనల్ హాకీ ఫెడరేషన్ (ఎఫ్ఐహెచ్) ప్రో లీగ్‌లో భారత హాకీ జట్లకు మిశ్రమ ఫలితాలు దక్కాయి. బుధవారం అర్జెంటీనాతో జరిగిన మ్యాచ్‌లలో పురుషుల జట్టు గెలుపొందగా అమ్మాయిలు ఓటమి పాలయ్యారు. అర్జెంటీనాతో మ్యాచ్‌ను 2-2తో సమం చేసుకున్న అబ్బాయిలు.. పెనాల్టీ షూటౌట్లో 5-4 తేడాతో ఉత్కంఠ విజయం సాధించారు. ఇక అమ్మాయిల ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్‌లో అర్జెంటీనా.. 5-0తో భారత్‌ను చిత్తుగా ఓడించింది.