జోహర్(మలేషియా): సుల్తాన్ జోహర్ కప్ టోర్నీలో భారత యువ హాకీ జట్టు అదిరిపోయే బోణీ కొట్టింది. శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 4-2తో జపాన్‌పై అద్భుత విజయం సాధించింది. అమిర్ అలీ(12ని), గుర్జోత్సింగ్(36ని), ఆనంద్ సౌరభ్(44ని), అంకిత్పాల్(47ని) యువ భారత్ తరఫున గోల్స్ చేశారు. సుబాస తనాక(26ని), రకుసి యమనక(57ని) జపాన్‌కు గోల్స్ అందించారు.
దిగ్గజ గోల్‌కీపర్ పీఆర్ శ్రీజేశ్ జూనియర్ హాకీ జట్టు కోచ్‌గా బాధ్యతలు అందుకున్న తర్వాత భారత్‌కు దక్కిన తొలి విజయం ఇది. మ్యాచ్‌లో ఆది నుంచే తమదైన దూకుడు కనబరిచిన కుర్రాళ్లు.. జపాన్ డిఫెన్స్‌ను ఛేదిస్తూ వరుస గోల్స్‌తో విరుచుకుపడ్డారు. అలీ గోల్‌తో మొదలైన భారత్ గోల్ పరంపర చివరి వరకు కొనసాగింది.