Amit Rohidas | పారిస్: భారత హాకీ జట్టు డిఫెండర్ అమిత్ రోహిదాస్ ఒక మ్యాచ్ సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఆదివారం క్వార్టర్స్ పోరులో భాగంగా గ్రేట్ బ్రిటన్‌తో జరిగిన మ్యాచ్‌లో అమిత్.. ప్రత్యర్థి జట్టు ఆటగాడు కల్నన్ను ఉద్దేశపూర్వకంగా హాకీ స్టిక్‌తో కొట్టాడని ఆరోపిస్తూ రిఫరీ రెడ్ కార్డ్ చూపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్ఐహెచ్) నియామవళిని అనుసరించి అమిత్‌పై ఒక మ్యాచ్ వేటు పడింది.
దీంతో అతడు మంగళవారం జర్మనీతో జరిగే సెమీస్ మ్యాచ్‌కు అందుబాటులో ఉండడు. ఇదిలా ఉండగా ఈ నిర్ణయంపై హాకీ ఇండియా ఆందోళన వ్యక్తం చేస్తూ ఎఫ్ఐహెచ్ జ్యూరీ బెంచ్‌కు లేఖ రాసింది. మ్యాచ్‌లో అమిత్ కావాలని కల్నన్ తలమీద కొట్టలేదని అది యాదృశ్చికంగా జరిగిందని హాకీ ఇండియా వాదిస్తోంది.