బతుమి(జార్జియా): ప్రతిష్టాత్మక మహిళల చెస్ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, దివ్యా దేశ్‌ముఖ్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. తద్వారా క్యాండిడేట్స్ టోర్నీ అర్హత మరింత చేరవయ్యారు. సోమవారం జరిగిన పోరులో హంపి 44 ఎత్తుల్లో పోలండ్‌కు చెందిన క్లాడియా కులోన్పై అద్భుత విజయం సాధించింది. నల్లపావులతో బరిలోకి దిగిన హంపి.. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. పోలాండ్ ప్లేయర్ తప్పిదాన్ని తనకు అనుకూలంగా మలుచుకుంటూ హంపి గెలిచి ముందంజ వేసింది. గేమ్ 32వ ఎత్తులో కులోన్ వైట్ పాన్‌ను జీ5లోకి ఎత్తు వేయడం ద్వారా హంపికి అవకాశం కల్పించింది. ప్రిక్వార్టర్స్‌లో అలెగ్జాండ్రా కొస్తెనుక్ లేదా మెరీ అర్బాడ్జ్తో హంపి తలపడుతుంది. మరోవైపు తీయోడెరా ఇంజాక్(సెర్బియా)తో పోరును దివ్యాదేశ్ముఖ్ డ్రా చేసుకుంది. కత్రెయనా లాగ్నో చేతిలో వంతికా అగర్వాల్ ఓటమిపాలైంది. హారికా ద్రోణవల్లి, వైశాలి తమ ప్రత్యర్థులతో గేమ్‌లను డ్రా చేసుకున్నారు.