బ్రెజిల్: ప్రపంచ టేబుల్ టెన్నిస్ (డబ్ల్యూటీటీ) స్టార్ కంటెండర్ టోర్నీ చరిత్రలో భారత టీటీ జట్లు సరికొత్త చరిత్ర సృష్టించాయి. బ్రెజిల్లో జరుగుతున్న ఈ టోర్నీలో భారత పురుషుల ద్వయం మానవ్ ఠక్కర్-మనుష్ షా తో పాటు మిక్స్డ్ డబుల్స్‌లో మనుష్ షా-దివ్య చిటాలె జోడీ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్ టోర్నీలో భారత్ నుంచి ఒకేసారి రెండు డబుల్స్ జట్లు ఫైనల్ చేరడం ఇదే ప్రథమం. పురుషుల డబుల్స్ సెమీస్‌లో మనుష్-మానవ్.. 3-2 (5-11, 11-9, 11-6, 8-11, 11-5)తో హువాంగ్ యన్చెంగ్-కువొ గువాన్ హాంగ్ (చైనీస్ తైఫీ)ని చిత్తు చేశారు. అంతకుముందు మిక్స్డ్ డబుల్స్ పోరులో మనుష్-దివ్య.. 3-0 (11-7, 11-2, 11-7)తో నాలుగో సీడ్ చిలీ జంట నికోలస్-పౌలీనాను చిత్తు చేసింది.